
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఈ నెల 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఒబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టిగా బైట్ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో రెండేండ్లు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్ డేట్స్ మూడేండ్లపాటు అందించనున్నారు. 33వాట్ల చార్జింగ్‌కు, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అదించారు. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), మరో రెండు 2-మెగా పిక్సెల్ మాక్రో, డెప్త్ సెన్సర్ కెమెరాలను ఇచ్చారు. అలాగే సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.