
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ సడెన్ గా డౌన్ అయితే తమ సొంత పనులకు కూడా ఆటకం కలుగుతుంది. అస్తమానం బ్యాటరీ లైఫ్ డౌన్ అవుతుండటంతో ఫోన్ వాడాలన్నా కూడా చిరాకు వస్తుంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన బ్యాటరీ ఛార్జింగ్ దిగి పోతుంది. కాబట్టి, ఆ సమస్యకు ఈ సీక్రెట్ టిప్స్ తో చెక్ పట్టేయండి ఇలా..

ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. మనం ఒక్కోసారి ఎలాంటి యాప్స్ వాడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యి బ్యాటరీ లైఫ్ ను తగ్గిస్తాయి. అప్పుడు వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ యూసేజ్ చూసి ఏది ఎక్కువగా పవర్ ను తీసుకుంటుందో చూసి వాటిని డిసేబుల్ చేయండి.

కొందరు అదే పనిగా బ్రైట్‌నెస్ ను ఎక్కువ పెట్టేస్తారు. దీని వలన బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఫోన్ స్క్రీన్ ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తే అంత వేగాంగా ఛార్జింగ్ దిగిపోతుంది. కాబట్టి, ఈ తప్పు అస్సలు చేయకండి. డార్క్ మోడ్ లోనే మీ స్మార్ట్ ఫోన్ ను వాడితే బ్యాటరీ కూడా ఆదా అవుతుంది.

బ్లూటూత్, వైఫై, జీపీయస్ ఆన్‌లో ఉంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గి పోతుంది. ఎందుకంటే అవి సిగ్నల్స్ కోసం అదే పనిగా వెతుకుతూనే ఉంటాయి. కాబట్టి, వాటిని అవసరం ఉంటే తప్ప ఎక్కువగా ఆన్ చేసి పెట్టుకోకండి.

నోటిఫికేషన్లు కూడా అన్ని యాప్స్ వి ఆన్ చేసి పెట్టుకోకండి. మొబైల్ ఫోన్ లో నున్న అన్ని యాప్స్ నుంచి నోటిఫికేషన్లు రావడం వల్ల స్క్రీన్ ఆన్ అవుతూ ఉంటుంది. ఇదంతా బ్యాటరీపైన పడుతుంది. మెయిల్ అప్డేట్స్ యాప్స్ తప్ప మిగతా వాటిని ఆఫ్ చేస్తే బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది.