Sim Cards: ఏదైనా నెట్‌వర్క్ నుంచి సిగ్నల్, ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోయినా.. ఆఫర్లు నచ్చకపోయినా వేరే నెట్‌వర్క్‌కి నెంబర్ మార్చకుండానే పోర్ట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఒక సిమ్ కార్డ్‌ని ఎన్ని సార్లు పోర్ట్ చేయవచ్చనే వివరాలు చాలా మందికి తెలియదు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్త ఎమ్ఎన్‌పీ లేదా మొబైల్ నంబర్ పోర్టడిలిటీ నియమాల ద్వారా కస్టమర్ ఎలాంటి సమస్యలు లేకుండానే తన నంబర్‌ని ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కి బదిలీ అయ్యేందుకు వీలు ఉంది.
ఈ క్రమంలో మీరు ఎన్ని సార్లు సిమ్‌ని పోర్ట్ చేయవచ్చంటే.. దానికి ఒక పరిమితి అంటూ లేదు. అంటే మీకు మీరు ఎంచుకున్న నెట్వర్క్ సేవలు నచ్చనట్లయినా, వారి సేవలతో మీరు సంతృప్తి చెందకపోయినా వెంటనే వేరే నెట్వర్క్‌కి పోర్ట్ అవ్వవచ్చు.
కానీ మీ మొబైల్ నంబర్‌ని పోర్ట్ చేయాలనుకునే ముందుగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమింటే.. మొబైల్ నంబర్‌ని మరో నెట్వర్క్‌కి మార్చాలనుకుంటే, ముందుగా మీ పాత నెట్‌వర్క్‌లో మీ సిమ్ కార్డుపై ఉన్న బకాయిలను తీర్చాలి .
ముఖ్యంగా పోస్ట్ పెయిడ్ కస్టమర్లు తమ సిమ్‌పై నెలవారీ బిల్లు మొత్తం బకాయి ఉంటే మీరు ప్రస్తుతం ఉన్న టెలికాం సర్వీస్ కంపెనీకి దాన్ని చెల్లించడం తప్పనిసరి. బాకీ ఉంటే పోర్టింగ్ సాధ్యం కాదు.
అలాగే ఏదైనా నెట్‌వర్క్‌కి పోర్ట్ చేయాలంటే ప్రస్తుత నెట్‌వర్క్‌లో కనీసం 90 రోజులు ఉండాలి. అలా లేకుంటే మరో నెట్‌వర్క్‌కు పోర్ట్ అవలేరు.