
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ప్రధాని మోదీ సహా 6 వేల మంది అతిథులు పాల్గొననున్నారు.

ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కొన్ని ఏఐ ఫొటోలను రూపొందించారు. 26 ఏళ్ల తర్వాత అయోధ్య ఎలా ఉండనుందన్న ఆలోచనతో ఈ ఫొటోలను రూపొందించారు.

మారుతోన్న టెక్నాలజీకి ఆధారంగా వచ్చే 26 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో భక్తులు అయోధ్య రామ మందిర దర్శనానికి ఇలాంటి ట్యాక్సీల్లోనే వస్తారన్న కాన్సెప్ట్‌తో ఈ ఏఐ ఫొటోలను డిజైన్ చేశారు.

ఇక మరో 26 ఏళ్లలో రోబోలకు హ్యూమన్ ఎమోషన్స్ వస్తాయన్న కాన్సెప్ట్‌తో ఈ ఏఐ ఫొటోలను డిజైన్ చేశారు. వీటిలో రోబోలు ధ్యానం చేస్తున్నట్లున్న ఫొటోలను రూపొందించారు.

రానున్న 26 ఏళ్లలో టెక్నాలజీ పూర్తిగా మారుతుందన్న కాన్సెప్ట్‌తో ఈ ఫొటోలను రూపొందించారు. అయితే ఎంత టెక్నాలజీ మారినా.. ఆలయం నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేనట్లు ఈ ఫొటోల్లో చూపించారు.