
భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయ్యింది. హెసెన్స్ అనే కంపెనీ లేజీర్ టీవీ 120ఎల్9జీ పేరుతో 120 ఇంచెస్ టీవీని తీసుకొచ్చింది. అడ్వాన్స్ టెక్నాలజీతో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుందీ టీవీ.

ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 3000 లుమినస్ బ్రైట్‌నెస్, 4కే అల్ట్రా హెచ్‌డీ పిక్షర్ క్వాలిటీతో 120 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. 40వాట్ డాల్బీ అట్‌మోస్ సౌండ్ ఫీచర్ ఉంది.

ఈ టీవీ ధర అక్షరాల రూ. 4,99,999గా ఉంది. ఈ టీవీ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్ కలర్ టెక్నాలజీ ఉపయోగించిన టీవీగా ఇది పేరుగాంచింది.

వైడ్ కలర్, స్పోర్ట్స్ కోసం స్మూత్ మోషన్, ఫిల్మ్‌మేకర్ మోడ్, టీయూవీ బ్లూ లైట్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఈ టీవీ సొంతం.

ఇందులోని ప్రాక్సిమిటీ సెన్సార్‌తో యూజర్లు టీవీ స్క్రీన్‌కు దగ్గరగా ఉంటే అటోమెటిక్‌గా బ్రైట్‌నెస్ తగ్గించి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో థియేటర్ అనుభూతి కలిగించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.