Ganesh: ఈ గణేశుడికి రూ. 400 కోట్ల ఇన్సూరెన్స్‌.. ఎందుకనేగా మీ సందేహం

|

Aug 27, 2024 | 12:58 PM

సెప్టెంబర్‌ 7వ తేదీన వినాయక చవితి జరగనున్న విషయం తెలిసిందే. పండగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా గణేష్‌ ఉత్సావాలకు సన్నహాలు చేస్తున్నారు. వినాయక విగ్రహాల కొనుగోలు మొదలు పెడుతున్నారు. అయితే వినాయక ఉత్సవాలు నిర్వహించే సమయంలో విగ్రహాలకు, మండపాలకు బీమా చేయడం కూడా సర్వసాధారణమైన విషయం. అయితే ఓ గణేశుడికి ఏకంగా రూ. 400 కోట్ల బీమా చేశారు..

1 / 5
వినాయక చవితి వేడుకలు అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిలో ముంబయి నగరం ప్రధానమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నిర్వహించే గణేశ్‌ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు వేడుకలు వీక్షించేందుకు ముంబయి వెళ్తుంటారు.

2 / 5
మరీ ముఖ్యంగా ముంబయిలో కింగ్‌ సర్కిల్‌లో జీఎస్బీ సేవా మండల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి జీఎస్బీ రాజా మండపానికి దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉంటుంది. దీనికి కారణం ఈ మండం కోసం నిర్వాహకులు తీసుకునే ఇన్సూరెన్స్‌.

3 / 5
ప్రతీ ఏటా బీమా విషయమై వార్తల్లో నిలిచే ఈ మండపం ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి నిర్వాహకులు ఏకంగా రూ. 400.58 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేశారు. గణేశుడి దర్శనం కోసం వచ్చే భక్తులు, వాలంటీర్లు, వంటవారు, సేవా సిబ్బంది, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, స్టాల్ కార్మికులకు బీమా వర్తిస్తుంది.

4 / 5
ఇదిలా ఉంటే జీఎస్బీ సేవా మండల్‌ ఈ ఏడాది 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 5వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉంటే 2023లో రూ. 360 కోట్లకు ఇన్సూరెన్స్‌ తీసుకోగా ఇప్పుడు ఈ మొత్తం రూ. 400 కోట్లకు పెరిగింది.

5 / 5
5 రోజులపాటు జరిగే ఈ వేడుకలకు ప్రతీరోజూ 20 వేల మందికిపైగా భక్తులు దర్శనం కోసం వస్తారు. జీఎస్‌బీ మహాగణపతికి దాదాపు 66 కిలోల బంగారు అభరణాలు, 325 కిలోల వెండి అభరణాలతో అలంకరిస్తారు.