
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. పెద్దలకే పరిమితం కాకుండా చిన్నారులను టార్గెట్ చేస్తూ పలు సంస్థలు స్మార్ట్ వాచ్‌లను తీసుకొస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా గోకీ (GOQii) అనే కంపెనీ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది.

ఈ స్మార్ట్ వాచ్‌లో ఎస్‌పీవో2, శరీర ఉష్ణోగ్రత, పల్స్ రేట్, బీపీ లాంటి వివరాలను ఈ స్మార్ట్ ఫోన్ ఇట్టే చెప్పేస్తుంది. కరోనా థార్డ్ వేవ్ రానుందన్న నేపథ్యంలో ఈ వాచ్ ఎంతో ఉపయోగపడనుంది.

ఈ స్మార్ట్ వాచ్‌ను 18 యాక్టివిటీ మోడ్స్‌తో తీసుకొచ్చారు. ఐపీ68 సర్టిఫైడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఈ స్మార్ట్ వాచ్ మరో ప్రత్యేకత.

ఇందులో బాడీ టెంపరేచర్, హార్ట్‌రేట్, స్లీప్ ట్రాకింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వాచ్‌ను స్మార్ట్ ఫోన్‌తో లింక్ చేయడం ద్వారా పేరెంట్స్ ఎప్పటికప్పుడు చిన్నారులను మానిటర్ చేయొచ్చు.

ఈ స్మార్ట్ వాచ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు గోకీ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 4,999కి లభిస్తుంది.