
నిజానికి మొన్నటి ఈ డిజిటల్ ఓటర్ కార్డు కేవలం 2022 తర్వాత నమోదు చేసుకున్న ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం అందరికీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ విధానం ద్వారా ఓటర్ కార్డును తొలుత డిజిటల్ ఫార్మట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని అనంతరం దానిని డిజి లాకర్ యాప్‌లో సేవ్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఇంతకీ ఈ డిజిటల్ ఓటర్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం ఓటర్ హెల్ప్‌పైన్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి.

ఆ తర్వాత వెబ్‌సైట్‌లో కనిపించే ఈ-ఎపిక్ కార్డు డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే అక్కడ పేర్కొన్న వివరాలను అందించాలి. తర్వాత మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీని ఎంటర్ చేయగానే ఓటర్ కార్డు డిజిటల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం డిజిటల్ లాకర్‌లో సేవ్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్ సైతం తీసుకోవచ్చు.