ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకర్షించేందుకు 'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్'ను ప్రారంభించింది. సెప్టెంబర్ 2న ప్రారంభమైన ఈ సేల్ 8వ తేదీతో ముగియనుంది. ఇందులో భాగంగా పలు మొబైల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది.
ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 79,900గా ఉన్న ఈ ఫోన్ ఆఫర్లో భాగంగా రూ. 66,999కే లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్‌లో భాగంగా రూ.15,000 వరకు ధర తగ్గుతుంది.
గూగుల్ పిక్సెల్ 4ఏను సేల్‌లో భాగంగా రూ. 31,999కే అందిస్తున్నారు. ఇక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన డెబిట్ కార్డు ద్వారా నెలకు రూ. 2,694ల ఈఎమ్‌ఐతో కూడా ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 12 మినీపై రూ. 9,901 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 59,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 11 రూ. 51,999, ఐఫోన్ ఎక్స్‌ఆర్ రూ. 42,999కి లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా వివో ఎక్స్ 60 ఫోన్‌ను రూ. 34,990 అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు.
రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్5జీ ధర రూ. 26,999కి అందుబాటులో ఉండగా.. ఎమ్‌ఐ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 34,999కి లభిస్తుంది.