
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 6న మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు టీవలపై ఆకట్టుకునే ఆఫర్లు ఉన్నాయి.

OnePlus Y Series: వన్‌ప్లస్ వై సిరీస్ 31 ఇంచెస్ టీవీ ఆఫర్‌లో భాగంగా రూ. 16,499కి అందుబాటులో ఉంది. ఈ టీవీ హెచ్‌డీ రడీ ఎల్‌ఈడీతో రూపొందించారు. సేల్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్ లభించనుంది.

Realme 80 cm: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో టీవీ రియల్‌మీ 80 సీఎమ్. ఈ 32 ఇంచెస్ టీవీ సేల్‌లో భాగంగా 11 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 24 వాట్స్ అవుట్‌పుట్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ టీవీ సొంతం. ధర విషయానికొస్తే రూ. 15,999కి అందుబాటులో ఉంది.

Kodak 60 cm: అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న మరో టీవీ కొడాక్ 60 సీఎమ్. 24 ఇంచెస్ టీవీ ధర 32 శాతం తగ్గింపు ధరతో రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీలో 20 వాట్స్ స్పీకర్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఇక ఈ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ.6,000 తగ్గింపు లభిస్తోంది.

Samsung 80 cm: సామ్‌సంగ్ 80 సీఎమ్ స్మార్ట్ టీవీ రూ. 16,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీపై 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20 వాట్స్ స్పీకర్‌ను అందించారు.