POCO M5: రూ. 16 వేల ఫోన్‌ను రూ. 8500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. అదిరిపోయే సేల్‌

|

Jul 17, 2023 | 5:02 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్స్‌ పేరుతో మంచి ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే పోకో ఎమ్‌5 స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 44 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.? డిస్కౌంట్‌ తర్వాత ఈ ఫోన్‌ ఎంతకు లభిస్తోంది.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5
ప్రముఖ ఈకామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌లో  బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ నడుస్తోన్న విషయం తెలిసిందే. జులై 15వ తేదీన మొదలైన ఈ సేల్‌ 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగానే పోకో ఫోన్‌పై మంచి ఆఫర్‌ను అందిస్తోంది.

2 / 5
పోకో ఎమ్‌5 స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 46 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఈ స్మార్ట్‌ ఫోన్‌ (4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌) అసలు ధర రూ. 15,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 8,499కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 10,499కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకుల చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందొచ్చు.

3 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + ఐపీఎస్‌ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్‌, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు.

4 / 5
 కెమెరా విషయానికొస్తే పోకో ఎం5లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఆక్డాకోర్‌ 6ఎన్ఎం మీడియా టెక్ హేలియో జీ99 ఎస్వోసీ చిప్ సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల 18 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే బ్యాటరీని అందించారు.