- Telugu News Photo Gallery Technology photos Flipkart big diwali sale 2024 huge discount on Google Pixel 8 smart phone
Google Pixel: గూగుల్ పిక్సెల్8పై భారీ డిస్కౌంట్.. సగానికి సగం తక్కువ
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 21వ తేదీ నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. అయితే ఒకరోజు ముందుగానే వీఐపీ మెంబర్స్‌కి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8 భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 20, 2024 | 1:22 PM

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్8పై భారీ ఆఫర్ లభిస్తోంది. 256 జీబీ వేరియంట్ ఫోన్‌పై ఈ డీల్ అందిస్తోంది.

గూగులల్ పిక్సెల్ 8 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,999కాగా సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 42,999కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

దీంతో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 36,499కి సొంతం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా రూ. 42,500వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.2 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం T3 చిప్‌సెట్ అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10.5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి ప్రత్యేక ఈ ఫీచర్ ఈ ఫోన్ సొంతం. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.




