
గోద్రెజ్ 223 ఎల్ ఫ్రిడ్జ్ సమర్థవంతమైన ఇన్వర్టర్ కంప్రెసర్, శీతలీకరణకు అధునాతన సాంకేతికత,మెరుగైన కూలింగ్ అందించే మల్టీ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. ఫ్రీక్వెన్సీని బట్టి ఆటోమెటిక్ గా డీఫ్రాస్ట్ అవుతుంది. దీనిలోని నానో షీల్డ్ టెక్నాలజీ ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది. దీని మొత్తం ఉత్పత్తిపై ఏడాది, కంప్రెసర్ పై పదేళ్ల వారంటీ ఉంది. గోద్రెజ్ 223 ఎల్ రిఫ్రిజిరేటర్రూ. 19,990కు అందుబాటులో ఉంది.

హాయర్ 240 ఎల్ కుటుంబంలో సభ్యులందరి అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఈ ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్ శీతలీకరణ, తాజాదనం, పనితీరు చాలా బాగుంటాయి. కన్వర్టిబుల్ 5 ఇన్ 1 టెక్నాలజీ, ట్విన్ ఎనర్జీ సేవింగ్ మోడ్, టర్బో ఐసింగ్, టెంపరేచర్ నాబ్ కంట్రోలర్, యాంటీ బాక్టీరియల్ రబ్బరు పట్టీ ఉన్నాయి. ఉత్పత్తిపై ఏడాది, కంప్రెసర్‌పై పదేళ్ల వారంటీ ఇస్తున్నారు. హాయర్ డబుల్ డోర్ ఫ్రిజ్ రూ. 23,790కు అందుబాటులో ఉంది.

ఎల్ జీ 242 ఎల్ రిఫ్రిజిరేటర్ లోని ఆటో డీఫ్రాస్ట్ ఫంక్షన్ మంచు గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో శబ్దం చాలా తక్కువ వస్తుంది. వాటర్ బాటిళ్లు, కోక్‌లు, ఇతర వాటిని పెట్టుకునేందుకు వీలుగా టఫ్డ్ గ్లాస్ ఫ్రేమ్‌తో మూడు షెల్ఫ్‌లను ఏర్పాటు చేశారు. ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో శీతలీకరణ వ్యవస్థ ప్రతి మూలకు చల్లని గాలిని పంపిస్తుంది. 242 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఫ్రిజ్డ్ రెండు నుంచి నాలుగు కుటుంబాలకు సరిపోతుంది. ఉత్పత్తిపై ఏడాది, కంప్రెసర్‌పై పదేళ్ల వారంటీ ఉంది. ఎల్ జీ రిఫ్రిజిటర్ ధర: రూ. 23,990.

వోల్టాస్ బెకో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. దీనిలోని వోలాస్ బెకో ఫ్రిడ్జ్ నియో ఫ్రాస్ట్ డ్యూయల్ టెక్నాలజీతో ఫ్రీజర్, రిఫ్రిజెరాంట్ కంపార్ట్‌మెంట్లలోకి గాలిని వీచేందుకు రెండు వేర్వేరు శీతలీకరణ వ్యవస్థలు పనిచేస్తాయి. స్టోర్ తాజా సాంకేతికతతో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ప్రో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్, బ్లూ లైట్ టెక్నాలజీ అదనపు ఆకర్షణ, ఈ రిఫ్రిజిరేటర్ పై రెండేళ్లు, కంప్రెసర్‌పై పదేళ్ల వారంటీ ఉంది. వోల్టాస్ రిఫ్రిజిరేటర్ ధర రూ.24,490.

వర్ల్‌పూల్ 235 ఎల్ రిఫ్రిజిరేటర్ లోని ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీతో శీతలీకరణ వేగంగా అవుతుంది. దీనిలో హై టెక్ ఆప్షన్లు 160వీ- 300వీ మధ్య అధిక హెచ్చుతగ్గుల వోల్టేజీలలో కూడా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్‌ను కలిగి ఉంటాయి. 15 రోజుల వరకు పండ్లు. కూరగాయల తాజాదనంతో కనిపిస్తాయి. అధునాతన కంట్రోల్ కూలింగ్ నాబ్‌తో ఈ ఫ్రిజ్ ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించవచ్చు. వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్ ధర రూ. 23,190.