
గూగుల్ మ్యాప్‌లో రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్ ఫీచర్ ఉంటుంది. దీంతో మీరు వెళ్తున్న ప్రదేశంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే ఆలస్యం అవుతుందని అనిపిస్తే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తుంది.

ఇక మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫీచర్. ఆఫ్‌లైన్‌లో కూడా యాప్‌ను వినియోగించుకోవడం. ఇంటర్నెట్ కనెక్షన్ లేని చోట్ల కూడా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నెట్ ఉన్నప్పుడు మనం వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి సంబంధించిన మ్యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మ్యాప్స్‌లో ఉండే స్ట్రీట్ వ్యూ ఫీచర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ గ్రౌండ్ లెవల్ వ్యూను అందిస్తుంది. దీంతో ల్యాండ్‌మార్క్స్, ఎంట్రెన్స్‌లను గుర్తించేందుకు సహాయపడుతుంది.

మ్యాప్స్‌లో మనం ఏదైనా లొకేషన్‌ను సెట్ చేసుకున్నప్పుడు ప్రివ్యూ మాములుగా కనిపిస్తుంది. అయితే రియల్ టైమ్ లొకేషన్స్ కనిపించాలంటే అందుకోసం రూట్ ప్రివ్యూ పక్కన ఉన్న థ్రీ డాట్స్‌ను సెలక్ట్ చేసుకుని శాటిలైట్, ట్రాఫిక్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకుంటే మంచి ప్రివ్యూ కనిపిస్తుంది.

ఇక గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫీచర్ వాయిస్ కమాండ్స్. సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మ్యాప్స్‌ను ఆపరేట్ చేసుకునేందుకు వాయిస్ కమాండ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. 'హే గూగుల్' కమాండ్‌తో మ్యాప్స్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు.