Wave Sigma 3: రూ. 1200లో కళ్లు చెదిరే ఫీచర్లతో.. బోట్‌ నుంచి అదిరే స్మార్ట్‌ వాచ్‌.

|

May 23, 2024 | 11:22 AM

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నాయి. కంపెనీలు ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ వియరబుల్ బ్రాండ్‌ బోట్‌ కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ బోట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. బోట్‌వేవ్‌ సిగ్మ 3 పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. నావిగేషన్‌ ఫీచర్‌ను ఇందులో మరింత సులభతరం చేశారు. దీంతో మ్యాప్స్‌ కోసం ఇకపై మీ స్మార్ట్ ఫోన్‌ను చూడాల్సిన పని ఉండదు.

2 / 5
ఈ వాచ్‌ను యాక్టివ్‌ బ్లాక్‌, మెటల్‌ బ్యాలక్‌, మెటల్‌ గ్రే, కూల్‌ గ్రే, చెర్రీ బ్లూజుమ్‌, రస్టిక్‌ రోస్‌, బ్రీజ్‌ వంటి కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాచ్ ధరను రూ. 1199గా నిర్ణయించారు. బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి ఈ కామర్స్‌ సైట్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

3 / 5
ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.01 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 550 నిట్స్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. దీంతో సన్‌లైట్‌లో కూడా వాచ్‌ స్క్రీన్‌ను స్పష్టంగా చూడొచ్చు. మాప్‌మై ఇండియా ఇందులో నావిగేషన్ సిస్టమ్‌ను అందిస్తోంది.

4 / 5
ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా క్యూఆర్‌ కోడ్‌ ట్రేను అందించారు. దీంతో మీకు అవసరమైన క్యూఆర్‌ కోడ్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. దీంతో టికెట్‌ స్కానింగ్, పేమెంట్‌ కోడ్‌ వంటి స్కానింగ్‌లు సులభంగా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

5 / 5
డయల్‌ ప్యాడ్, కాంటాక్ట్‌ లిస్ట్‌ను అందించారు. అలాగే ఈ వాచ్‌ను ఐపీ67 వాటర్‌ రెసిస్టెంట్‌తో రూపొందించారు. దీంతో వాటర్‌, చెమట నుంచి రక్షణ పొందొచ్చు. ఇక వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే వారం రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. వీటితో పాటు ఎస్‌పీఓ2, స్లీప్‌ ట్రాకింగ్‌ వంటి హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్లతో పాటు.. 700కిపైసగా యాక్టివ్‌ మోడ్స్‌ను అందించారు.