
బోట్ మార్కెట్లోకి సరికొత్త ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఓపెన్ వైర్‌లెస్ సిస్టమ్‌తో ఈ ఇయర్ బడ్స్‌ను మార్కట్లోకి లాంచ్ చేశారు. Airdopes Loop OWS పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స చెవులకు ఫిట్ అయ్యేలా డిజైన్ చేశారు.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 12 ఎమ్‌ఎమ డ్రైవర్‌లను అందించారు. బోట్ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ క్యూ మోడ్‌తో యూజర్లకు మంచి సౌండ్ అనుభూతిని అందిస్తుంది

ఈ ఇయర్ బడ్స్‌లో 480 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో కూడిన శక్తివంతమైన బ్యాటరీని అందిచారు. ఇది 50 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అలాగే 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఏకంగా 20 నిమిషాల ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈజీ కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీని అందించారు. కేస్ తెరిచిన వెంటనే కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇందుకోసం IWP టెక్నాలజీని అందించారు. వాయిస్ అసిస్టెంట్కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ధర విషయానికొస్తే రూ. 1999కి లభిస్తోంది. లావెండ్ మిస్ట్, కూల్ గ్రే, పర్ల్ వైట్ కలర్స్‌లో తీసుకొచ్చారు. బోట్ అధికారిక సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా వంటి సైట్స్‌లో అందుబాటులో ఉంది.