పోకో ఎమ్6 ప్రో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్‌లో అందుబాటలో ఉంది. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ లెక్కన బేస్ వేరియంట్ రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ తొలి రెండు సేల్స్‌లో విశేష ఆదరణ లభించింది. తక్కువ ధరలో 5జీ ఫోన్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఫోన్ కోసం ఎగబడ్డారు. కేవలం 15 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోయింది. త్వరలోనే మరో సేల్‌ను నిర్వహించనుంది.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
ఆండ్రాయిడ్ 13 ఆపరేంటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా ర్యామ్‌ను మరో 6జీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ ఏఐ సెన్సార్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అంతేకాకుండా ఇందులో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.