Asus: అసుస్‌ నుంచి లక్ష రూపాయల స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే..

|

Mar 16, 2024 | 10:57 PM

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీ అసుస్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మొన్నటి వరకు మిడ్ రేంజ్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన అసూస్ తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. అసుస్‌ జెన్‌ఫోన్‌ 11 అల్ట్రా పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ అసుస్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. అసుసల్‌ జెన్‌ఫోన్‌ 11 అల్ట్రా పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను ప్రీమియం బడ్జెట్‌ రేంజ్‌లో లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ను అందించారు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 12బీజీ ర్యామ్‌, 246 స్టోరేజ్‌ అలాగే 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను ఇవ్వనున్నారు.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడి సోని ఐఎంఎక్స్ 890 ప్రైమర్‌ సెన్సర్‌ విత్ గింబల్‌ ఆప్టిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 65 వాట్స్‌ వైర్డ్‌, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
ధర  విషయానికొస్తే అసుస్‌ జెన్‌ఫోన్‌ 11 అల్ట్రా 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర మన కరెన్సీలో రూ. 99,615గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర విషయానికొస్తే రూ. 75,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో డ్యుయల్ స్టీరియో స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ తో వస్తుంది.