iOS 18 feature: ఐఓఎస్‌ 18 వచ్చేస్తోంది.. ఊహకందని ఫీచర్స్

|

Jun 11, 2024 | 9:12 AM

ఐఫోన్‌ లవర్స్‌కి యాపిల్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఎట్టకేలకు ఐఓఎస్‌ 18కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. సోమవారం నిర్వహించిన పిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్​ కాన్ఫరెన్స్ (యాపిల్​ డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో దీనికి సంబంధించి కంపెనీ ఓ ప్రకటన చేసింది. ఐఓఎస్‌ 18లో అధునాతన ఫీచర్లను జోడించనున్నారు. ఇంతకీ ఐఓఎస్‌ 18తో మీ ఫోన్‌లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి.? దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
 ఐఓస్‌18లో హోమ్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లకు తమకు కావాల్సిన చోట యాప్ ఐకాన్ల స్థానాన్ని మార్చుకునేలా యాపిల్ హోమ్ స్క్రీన్​కు పలు కస్టమైజెబుల్ ఫీచర్లను అందించనున్నారు. దీంతో పాటు యూజర్లు తమ వాల్ పేపర్ లేదా కలర్ కాంట్రాస్ట్‌కు తగ్గట్లు ఐకాన్‌ కలర్‌ను మార్చుకోవచ్చు.

2 / 5
ఇక మెసేజెస్‌ యాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో ట్యాప్‌ బ్యాక్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో యూజర్లు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మాటింగ్ చేయవచ్చు. టెక్స్ట్ ఎఫెక్ట్ లను యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌లో యాపిల్ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

3 / 5
ఐఓఎస్‌ 18లో ప్రైవసీకి పెద్ద పీట వేశారు. యాపిల్ యాప్ లాక్ వంటి అధునాతన ప్రైవసీ కంట్రోల్‌ను అందించారు.ఇది యూజర్ ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలదు. అలాగే యూజర్లు తమ యాప్స్‌ను హైడ్‌ చేసుకోవచ్చు. బ్లూటూత్‌ కనెక్టెడ్‌ పరికరాలకు సంబంధించి యాక్సెస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు.

4 / 5
ఈ కొత్త ఓఎస్‌లో యాపిల్‌ వాలెట్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఎయిర్‌ డ్రాప్‌ ఫంక్షనాలిటీ మాదిరిగా పనిచేసే ఈ కొత్త ఫీచర్‌తో ట్యాప్‌ టు క్యాష్‌ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు. ఇక ఇందులో మెయిల్‌ యాప్‌ అనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో మెయిల్స్‌ మరింత సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

5 / 5
ఇక ఐఓఎస్‌18లో వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌లో ఫొటోస్ అప్లికేషన్‌ ఒకటి. దీంతో యూజర్లు తమ ఫోటోలు, వీడియోలను మరింత పర్‌ఫెక్ట్‌గా మేనేజ్‌ చేయొచ్చు. మీరు కోరుకున్న నిర్ధిష్ట ఫొటోను సులభంగా కనుగునేలా చేయొచ్చు. ఇష్టమైన వాటిని ప్రత్యేక ప్రదేశంలో ఉంచడానికి యూజర్లు ఫోటోను కూడా పిన్ చేయవచ్చు.