
ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్ భాగంగా ఐఫోన్ 13 మోడల్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 28 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 69,000 కాగా ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా 28 శాతం డిస్కౌంట్‌తో రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొనుగోలు చేసే సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈఏమ్‌ఐ విధానంలో కొనుగోలు చేస్తే రూ. 1000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ లెక్కన ఐఫోన్ 13 128GB స్టోరేజ్ వేరియంట్‌ను సుమారు రూ.48,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ 13 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో రాత్రి సమయాల్లో అత్యంత నాణ్యతతో 4కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్ సపోర్ట్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ A15 Bionic చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది.