
Honor X9b: అమెజాన్ సేల్‌లో భాగంగా హానర్ ఎక్స్9బీ పై కూడా మంచి డిస్కౌంట్ లభిస్తోంది. హాలీ సేల్ భాగంగా ఈ ఫోన్‌ను 16 శాతం డిస్కౌంట్‌తో రూ. 25,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.5800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

Apple iPhone 13: ఐఫోన్ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. యాపిల్ ఐఫోన్13పై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను 17 శాతం డిస్కౌంట్‌తో రూ. 49,499కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినీ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 12 మెగాపిక్సెల్స్ రెయిర్, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం.

iQOO Neo 9 Pro: ఐక్యూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 39,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇందులో ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

IQOO Z9: ఐక్యూ జెడ్9 స్మార్ట్ ఫోన్‌పై ఈ సేల్‌లో భాగంగా 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం.

Poco M6 Pro: పోకో ఎమ్6 ప్రోపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీల.. వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం.