Samsung: సామ్సంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఎక్స్ఛేంజ్తో కేవలం రూ. 500కే..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్ ఫోన్స్‌పై మంచి డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. సమయంతో సంబంధం లేకుండా అదిరిపోయే డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్15 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఏంటీ డీల్.? ఎంత డిస్కౌంట్ లభించనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Tech News
Follow us on
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ తీసుకొచ్చిన సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్15 ఫోన్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయి. కాగా తాజాగా అమెజాన్‌లో ఈ ఫోన్‌పై 31 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 15,999కాగా అమెజాన్‌లో 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 10,999కి లభిస్తోంది. అలాగే అమెజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లిస్తే అదనంగా రూ. 329 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ. 10,400 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ ఫోన్‌కు పూర్తి డిస్కౌంట్ లభిస్తే రూ. 10,400 డిస్కౌంట్ పొందొచ్చు.
ఫీచర్ల విషయానికొస్తే సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్15 ఫోన్లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ ఫోన్లో 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను ఉచితంగా పొందొచ్చు. ఇక ఈ ఫోన్లో 6.5 ఇంచెస్‌తో కూడిన సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఫుల్హెచ్డీ+ రిలజ్యూషన్, 1080 x 2340 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. 2.2 జీహెచ్‌జెడ్ సీపీయూ స్పీడ్ ఈ ఫోన్ సొంతం.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్సతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్లో 6000 ఎమ్ఏహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీని అందించారు. 25 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. టైప్‌సీ కేబులకు సపోర్ట్ చేస్తుంఉది. ఈ ఫోన్‌పై ఏడాది మ్యానిఫాక్చర్ వారంటనీని అందించారు.