- Telugu News Photo Gallery Technology photos Amazon great indian festival diwali special sale Samsung Galaxy M05 features and price details
Samsung: క్రేజీ డీల్.. రూ. 6వేలకే సామ్‌సంగ్ ఫోన్.. 50 ఎంపీ కెమెరాతో పాటు..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళి స్పెషల్ పేరుతో సేల్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ ఫోన్‌పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 22, 2024 | 3:25 PM

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళి స్పెషల్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్05 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ను అన్ని డిస్కౌంట్ కలుపుకొని కేవలం రూ. 6వేల లోపే సొంతం చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్05 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 9,999 కాగా అమెజాన్ సేల్‌లో భాగంగా 35 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 6499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే రూ. 194 డిస్కౌంట్ పొందొచ్చు. పలు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా కూడా మంచి డిస్కౌంట్ లభిస్తోంది. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ.6150 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఫోన్‌ను రూ. 500కే సొంతం చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్05 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ పరంగా ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించారు. ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ బ్లూటూత్, వైఫ్, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు.




