Itel A60s: ఇంటెల్ స్మార్ట్ ఫోన్‌పై 26 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 8,499కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 6,299కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 ఎంపీ రెయిర్ కెమెరాతోపాటు, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
Nokia C12: నోకియా సీ12 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 7,499కాగా 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 5,999కి లభిస్తోంది. 6.3 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 2జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
Realme narzo 50i Prime: రియల్ మీ నార్జో 50ఐ ప్రైమ్ అసలు ధర రూ. 8,999కాగా 26 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,699కి లభిస్తోంది. ఆక్టాకోర్ ప్రాసెసర్ 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఇందులో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు.
Redmi A2: రెడ్‌మీ ఏ2 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8,999కాగా 30 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,299కే లభిస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఇందులో 16.5 సె.మీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
TECNO POP 7 Pro: రూ. 6 వేలలో లభిస్తోన్న మరో స్మార్ట్ ఫోన్ టెక్నో పాప్ 7ప్రో. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8,999కాగా 31 శాతం డిస్కౌంట్ పోను రూ. 6,199కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 26 గంటల కాలింగ్ స్టాండ్‌బై ఇస్తుంది.