
ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమేజాన్ అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. పలు రకాల స్మార్ట్ ఫోన్‌లు, గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌ను అందించింది. వాటిలో కొన్ని ఆఫర్లు ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 11 అసలు ధర రూ. 54,900 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 49,999కి అందిస్తోంది. ఐఫోన్ 12 అసలు ధర రూ. 79,900 కాగా రూ. 67,999కే అందిస్తోంది.

శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 20 అసలు ధర రూ. 86,000కాగా భారీ డిస్కౌంట్‌తో రూ. 54,999కే అందిస్తోంది. నోకియా జీ 20పై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది అమేజాన్. ఈ ఫోన్ అసలు ధర రూ. 14,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 12,999కే అందిస్తోంది. అంతేకాకుండా అమేజాన్ కూపన్‌ను ఉపయోగిస్తే మరో వెయ్యి రూపాయలు తగ్గుతుంది. అంటే ఈ ఫోన్ రూ. 10,990కే లభిస్తుంది.

అమేజాన్ ఫైర్ స్టిక్ అసలు ధర రూ. 4,999కాగా ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 2,799కే అందిస్తోంది. ఆపిల్ ఎస్‌ఈ స్మార్ట్ వాచ్‌పై అమేజాన్ సుమారు రూ. 4వేలు డిస్కౌంట్ ఇచ్చింది. దీని అసలు ధర రూ. 29,900 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 25,900కి లభిస్తుంది.

హెచ్‌పీ పావిలియన్ గేమింగ్ 15.6 ఇంచెస్ లాప్‌టాప్ అసలు ధర రూ. 77,549 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 66,490కి అందిస్తోంది. అంతేకాకుండా ఎక్సేంజ్ ద్వారా గరిష్టంగా మరో రూ. 18,150 డిస్కౌంట్ పొందొచ్చు