Air Conditioner: ఇల్లు చల్లగా ఉండటమే కాదు.. ఏసీ కొనే ముందు ఈ చిట్కాలు గుర్తుంచుకోండి.. లేకుంటే నష్టమే!

|

Aug 06, 2024 | 11:22 AM

Air Conditioner: ఏసీ కొనే సమయంలో చాలా మంది ఏసీ ధర, స్టార్ రేటింగ్ మాత్రమే చూస్తారు. అయితే ఏసీ కొనే సమయంలో ఇదొక్కటే కాదు, మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే నష్టపోతారన్న విషయం గుర్తించుకోవాలి..

1 / 7
వేసవి అయినా, వర్షాకాలమైనా ఇప్పుడు ఏసీ లేకుండా చాలా మంది ఉండలేరు. దాదాపు ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. అలాగే ఆఫీసులోల కూడా ఏసీలు ఉంటాయి. చాలా మంది వేసవి తర్వాత మళ్లీ ఏసీ కొనే ఆలోచనలో ఉంటారు.

2 / 7
ఏసీ కొనుగోలులో చాలా మంది ఏసీ ధర, స్టార్ రేటింగ్‌ను మాత్రమే చూస్తారు. అయితే ఏసీ కొనే సమయంలో ఇదొక్కటే కాదు, మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే నష్టపోతారు.

3 / 7
ఏసీ కంప్రెసర్ - కంప్రెసర్ ఏసీ వేగాన్ని నిర్ణయించడానికి, శక్తిని ఆదా చేయడానికి పని చేస్తుంది. కంప్రెసర్ బాగుంటే, AC గదిని మెరుగ్గా, వేగంగా చల్లబరుస్తుంది.

4 / 7
రేటింగ్- ఏసీలో స్టార్ రేటింగ్ కూడా చాలా ముఖ్యం. ఏసీలో స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. 4 లేదా 5 స్టార్ ఏసీ తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఫలితంగా బిల్లు తక్కువ వస్తుంది.

5 / 7
ఎయిర్ ఫిల్టర్ - మంచి ఏసీ అధిక నాణ్యత గల ఎయిర్ ఫిల్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది దుమ్ము, అలెర్జీ కారకాలు, ఇతర హానికరమైన కణాలను తొలగిస్తుంది. ఇండోర్ గాలిని శుభ్రంగా ఉంచుతుంది.

6 / 7
స్మార్ట్ ఏసీ- ఈ రోజుల్లో Wi-Fi ద్వారా కనెక్ట్ చేయబడిన స్మార్ట్ ఏసీలు ఉన్నాయి. ఏసీని స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. ఇందులో మీరు ఇంట్లోకి ప్రవేశించే ముందు ఇంటిని చల్లబరుస్తుంది.

7 / 7
స్లీప్ మోడ్, టైమర్- స్లీప్ మోడ్, టైమర్ కూడా ఇప్పుడు ఏసీలో చాలా ముఖ్యమైనవి. రాత్రిపూట ఏసీ నడిస్తే కరెంటు బిల్లు ఎక్కువ. కానీ ఏసీ స్లీప్ మోడ్ కలిగి ఉంటే, అది నిర్దిష్ట వ్యవధిలో స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇది శక్తిని కూడా ఆదా చేస్తుంది.