Acer Swift Go 14: ఏఐ టెక్నాలజీతో కొత్త ల్యాప్‌టాప్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

|

Feb 01, 2024 | 9:41 PM

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ అసెర్‌ స్విఫ్ట్‌జీయో 14 ల్యాప్‌టాప్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ కంపెనీ నుంచి ఇది వరకే వచ్చిన స్విఫ్ట్‌ జీయో14 ల్యాప్‌టాప్‌ను తాజాగా అప్‌డేట్‌ చేసి విడుదల చేసింది. ఆర్టిఫిషియల్‌ వంటి అడ్వాన్స్‌ టెక్నాలజీని ఇందులో అందించారు. ఇంతకీ ఈ అప్‌డేట్‌డ్‌ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ అసెర్‌ అప్‌డేటేడ్‌ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. గతంలో తీసుకొచ్చిన స్విఫ్ట్‌ జీఓ14 ల్యాప్‌టాప్‌ను AI సపోర్ట్ కలిగిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో అప్‌డేట్ చేసి విడుదల చేసింది.

2 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫంక్షలను మెరుగుపరచడానికి ఈ ఎన్‌పీయూలు మరింత ఉపయోగపడుతాయని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో రెండు ప్రాసెసర్‌లను అందించారు.

3 / 5
ధర విషయానికొస్తే.. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPUతో పనిచేసే ల్యాప్‌టాప్‌ ధర రూ. 84,990, కోర్ అల్ట్రా 7 వేరియంట్ ధర రూ.99,990గా నిర్ణయించారు. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిటైల్‌ స్టోర్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి వచ్చింది.

4 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌తో కూడిన ఊపీఎల్ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌ సొంతం. ఈ ల్యాప్‌టాప్‌ను 16జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇవి పాత మోడళ్ల కంటే 47 శాతం మెరుగైన పనితీరుతో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

5 / 5
ఏసర్‌ స్విఫ్ట్‌ గో14 ల్యాప్‌టాప్‌లో ఏఐతో రూపొందించిన డెప్త్ మ్యాప్‌లను 3డీలలో కూడా వీక్షించవచ్చు. వీడియో కాల్స్ కోసం 1440p QHD వెబ్‌క్యామ్‌ను అందించారు. దీనిలో మూడు-సెల్ 65W బ్యాటరీని అమర్చారు. దీంతో అత్యధికంగా 12.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలిపింది.