1 / 6
ప్రస్తుత కాలంలో చాలా మంది మగవాళ్లు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రోస్టెట్ అంటే మగవారిలో ఉండే వాల్‌నట్ ఆకారపు గ్రంధి. ఈ గ్రంధి పునురుత్పత్తి విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రోస్టెట్ గ్రంధి పనితీరుపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభం కానీ, చివరలో గుర్తిస్తే మాత్రం వైద్యం చేయడం కష్టతరమై ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రారంభ దశలో పురుష నాళం, ఎముకలు, ముత్రాశయం పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.