Kidney Disease: కిడ్నీ వ్యాధిని సకాలంలో గుర్తించండి.. లక్షణాలు ఏమిటో తెలుసుకోండి!
కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇందులో ఎలాంటి సమస్య వచ్చినా మనకు అనారోగ్యంతో పాటు కిడ్నీ నొప్పి కూడా వస్తుంది. తరచుగా మూత్రపిండ వైఫల్యానికి యంత్రం ద్వారా డయాలసిస్ అవసరం. అప్పుడు మాత్రమే శరీరం నుంచి విషాన్ని బయటకు తీయవచ్చు. కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రధాన సమస్య ఏమిటంటే వ్యాధిని చాలా ఆలస్యంగా గుర్తించడం. అయితే కొన్ని ముఖ్యమైన లక్షణాల ద్వారా మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చు..