
ఈ విత్తనాలు చాలా పవర్ఫుల్. అవి ఏవో కాదు పొద్దుతిరుగుడు విత్తనాలు వీటిని సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటారు. ఇవి గుండె ఆరోగ్యం పని తీరు మెరుగుపడటానికి, ఇంకా కొలెస్ట్రాల్ కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా చర్మ సౌందర్యానికి కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఇ, ప్రోటీన్లతో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యం: ఈ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించి, గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ తో ప్రమాదంలో పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ గింజలను తినడం అలవాటు చేసుకుంటే చాలు ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

రోగనిరోధక శక్తి: విటమిన్ ఇ, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు శరీర ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇంకా ఇవి జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను కూడా సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రోజూ కప్పు తింటే చాలు.

చర్మం, జుట్టు: దీనిలో విటమిన్ ఇ అందాన్ని పెంచుతుంది. ఇంకా ఈ చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఇంకా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. మీరు నిత్య నూతనంగా కనపడాలంటే ఇవి తింటే చాలు. ఇంకా చెప్పాలంటే ఇది షుగర్ సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. కాబట్టి, మీరు ఉదయం తీసుకుంటే చాలు.

(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)