
ఆంధ్ర స్టైల్లో టమాటా పప్పు ఇలా చేస్తే రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. దీనిని కంది పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి తో చేస్తారు. రుచి మాత్రం అదిరిపోతోంది. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.

కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు కంది పప్పు, 4 పండు టమాటాలు, 5 పచ్చిమిర్చి, మూడు ఉల్లిపాయలు, చింతపండు రసం, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి.

తయారీ విధానం: ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని, దానిలో రెండు గ్లాస్ లు నీళ్లు పోసి 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకుని పప్పు పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాలి.

పప్పు బాగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, 5 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తీసుకుని కుక్కర్ 5 విజిల్స్ వచ్చే పొయ్యి మీదే ఉడికించాలి.

పప్పు, టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ వెలిగించి పాన్‌లో నెయ్యి వేసి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, మూడు వెల్లుల్లి, నాలుగు కరివేపాకు, పోపు పెట్టి పప్పులో కలిపి కిందకి దించేయడమే.