
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు శనగపప్పు పాయసం, ఒక కప్పు బియ్యం, 3 కప్పుల మిల్క్, 200 గ్రాముల తురిమిన బెల్లం, అర టీ స్పూన్ ఏలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, బాదం పప్పులు , కిస్ మిస్ లు తీసుకోవాలి.

ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని నానాబెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యాన్ని కూడా తీసుకుని బాగా కడిగి తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకుని తురిమి ఇంకో పాత్రలో పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి మూడు కప్పుల పాలు పోసి రంగు మారి బాగా మరిగే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఆ తర్వాత దీనిలో తురిమిన బెల్లం, అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒక పెద్ద గరిటేతో మిక్స్ చేస్తూ తిప్పాలి.

పాలు మరిగిన వెంటనే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న శనగపప్పు వేసి, మీడియం మంట మీద ఉంచి 10 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉడికించాలి. శనగపప్పు బియ్యంలో కలిసి పోయే వరకు పొయ్యి మీదే అలాగే ఉంచండి.

బియ్యం, శనగపప్పు పప్పు ఉడికిన తర్వాత పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అది కాగిన తర్వాత బాదం పప్పులు, కిస్‌మిస్‌లను కూడా వేసి గోల్డ్ మారే వరకు బాగా వేయించి దీనిని పాయసంలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి శనగపప్పు పాయసం రెడీ.