4 / 6
విశేషమేమిటంటే.. ఆర్థర్ బోర్జెస్, గార్బిన్ ముగురుజాల మధ్య పరిచయం ఒక్క సెల్ఫీతో మొదలైంది. 2021లో న్యూయార్క్‌లో నడుస్తున్నప్పుడు, ఆర్థర్ బోర్జెస్ వచ్చి సెల్ఫీ అడిగాడు. ఈ సెల్ఫీ క్లిక్‌తో ఇద్దరూ కలిసిపోయారు. 'న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ దగ్గర నా హోటల్ ఉండేది. హోటల్ లో బోర్ గా ఉండడంతో ఆ రోజు వాకింగ్ కి వెళ్లాను. ఈ సమయంలో, ఆర్థర్ ఎదురయ్యాడు. అలా మా పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది' అని అంటోంది ముగురుజా