1999 ప్రపంచకప్‌లో సౌరభ్ గంగూలీ శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏడాదే భారత జట్టులో ఫిక్సింగ్ కుంభకోణం జరిగిన నేపథ్యంలో కెప్టెన్‌గా అవతరించాడు.
2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడోస్థానంలో బరిలోకి దిగి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20 ప్రపంచకప్(2007) సమయంలో సీనియర్ల గైర్హాజరీతో కెప్టెన్సీ దక్కించుకున్నాడు.
2012 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 183 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆ తర్వాత ఏడాదే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సారథి హోదాను అందుకున్నాడు. 2017లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా మారాడు.
2010లో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తొలిసారి ఈ మార్క్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. అక్కడి నుంచి సరిగ్గా 18 నెలల తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ దీనిని బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌పై 219 పరుగులు చేశాడు.