Indian Female Swimmers: అంతర్జాతీయ స్థాయిలో రాణించిన మహిళా స్విమ్మర్లు..!

|

Jul 02, 2021 | 6:44 PM

స్విమ్మింగ్ లో ఎన్నో విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి అవార్డులు అందించిన వారిలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఈ 5 గురు క్రీడాకారుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

1 / 6
మానా పటేల్ టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. భారత తరుపున బరిలోకి దిగనున్న మూడవ మహిళా స్విమ్మర్. స్విమ్మింగ్ లో భారత్ ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో పతకం సాధించలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించిన మొదటి మహిళా స్మిమ్మర్‌ గా చరిత్ర సృష్టించింది.

2 / 6
ఆర్తి సాహా.. తన బాల్యం నుంచే స్మిమ్మింగ్ చేసేది. 1959లో ఈమె ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొట్టమొదటి ఆసియా మహిళగా పేరు పొందింది. 1960లో పద్మశ్రీ అవార్డుతో తగిన గుర్తింపును ఇచ్చింది. ఈ గౌరవం పొందిన మొదటి మహిళా క్రీడాకారిణి కూడా ఆర్తి సాహానే కావడం విశేషం. ఈమెను హిందుస్తానీ జల్పరి అని కూడా పిలిస్తారు.  తన పుట్టిన రోజుకు ఓ నెల ముందు ఆమె 1994 లో మరణించింది.

3 / 6
నఫీసా అలీ.. నటి కాకముందు ఈతలో ఆరితేరారు. 1974లో జాతీయ ఛాంపియన్ గా నిలిచారు. అలాగే రాష్ట్రస్థాయి పోటీల్లో 100మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో 15 ఏళ్ల రికార్డును నఫీసా అలీ బద్దలు కొట్టింది. పాఠశాల, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో స్విమ్మింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత సినిమా రంగంలోకి ఎంటరై, పలు సినిమాల్లో నటించింది.

4 / 6
2004 ఏథేన్స్ ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏకైక భారతీయ స్విమ్మర్‌గా బెంగళూరుకు చెందిన శిఖా టాండన్ పేరు సంపాదించింది. 2005లో అర్జున అవార్డు అందుకుంది. శిఖా కేవలం 13 ఏళ్ల వయసులో ఆసియా క్రీడల్లో, 16 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది. 2005లో తన ఖాతాలో ఏడు జాతీయ రికార్డులను కలిగి ఉంది. తన కెరీర మొత్తంలో 146 జాతీయ ఛాంపియన్‌షిప్ పతకాలు, 36 అంతర్జాతీయ పతకాలు సాధించింది.

5 / 6
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ కి చెందిన భక్తి శర్మ.. తన తల్లి లీనా శర్మ నుంచి రెండెళ్ల వయసు నుంచే స్విమ్మింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. 2015లో అంటార్కిట్ మహా సముద్రంలోఒక డిగ్రీ ఉష్టోగ్రత వద్ద 52 నిమిషాల్లో 1.4 మైళ్ల దూరాన్ని ఈది ప్రపంచ రికార్డును  సృష్టించింది. ప్రపంచంలోని మొత్తం 5 మహా సముద్రాలలో ఈది పలు రికార్డులను తన పేరుతో లిఖించుకుంది.

6 / 6
ఆరేళ్ల వయసులో శివానీ స్విమ్మింగ్ చేయడం ప్రారంభించింది. 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో అత్యధిక జాతీయ రికార్డులు సాధించింది. 2016 రియో ఒలింపిక్స్ లో పాల్గొంది. కానీ, పతకం సాధించలేకపోయింది. 2016లో దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 2013లో ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ లో ఆరోస్థానంలో నిలిచింది.