
ఐపీఎల్ 2025 కంటే ముందు జరిగిన రిటెన్షన్స్‌లో ఆర్సీబీ మొహమ్మద్ సిరాజ్‌ను రిలీజ్ చేసింది. కానీ, తీరా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. తనన వదులుకొని ఆర్సీబీ తప్పు చేసిందని ప్రూవ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సిరాజ్, బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాకిచ్చాడు మొహమ్మద్ సిరాజ్. అద్భుతంగా ఫీల్డ్‌సెట్ చేసిన ఫామ్‌లో ఉన్న నితీష్ రాణాను అవుట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 30 పరుగులకు 1 వికెట్ కూడా తీసుకున్నాడు.

ఈ ఒక్క వికెట్ తో, ఈ సంవత్సరం ఐపీఎల్ లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. సిరాజ్ పవర్‌ప్లేలో 5 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి ఇప్పటివరకు 7 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అంతేకాకుండా, ఈ సంవత్సరం ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో కూడా మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 20 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 68 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. అంటే అతను 120 బంతుల్లో 52 బంతుల్లోనే పరుగులు ఇచ్చాడు.

ఈ 20 ఓవర్లలో సగటున 7.70 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ సిరాజ్ మొత్తం 10 వికెట్లు కూడా పడగొట్టాడు. దీని ద్వారా, అతను ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ఉన్నాడు. మొత్తం మీద, ఈ ఏడాది ఐపీఎల్‌లో నూతన ఉత్సాహంతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్, గుజరాత్ టైటాన్స్ జట్టుకు ట్రంప్ కార్డ్‌గా మారాడు.