uppula Raju |
Jan 24, 2022 | 4:28 PM
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ద్విచక్ర వాహన విభాగం చాలా పెద్దది. మెరుగైన మైలేజీ కోసం సూపర్ బైక్‌లు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం రూ.1 లక్ష లోపు వచ్చే బైక్‌ల గురించి తెలుసుకుందాం.
TVS మోటార్ కంపెనీ ఇటీవల TVS రైడర్ 125 బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 89,787 నుంచి రూ. 99,664 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 124.8 సిసి. ఇది 59 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఉంది. దీని బరువు 123 కిలోలు.
హీరో గ్లామర్ ధర రూ.75900 నుంచి రూ.85920 వరకు ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో 124.7 సిసి ఇంజన్ ఇచ్చారు. ఇది 10.84 PS పవర్, 10.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది డిస్క్ బ్రేక్‌లు ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది.
బజాజ్ పల్సర్ NS 125 ధర 99 వేల రూపాయల వరకు ఉంది. ఈ మోటార్‌సైకిల్ సూపర్ లుక్‌తో వస్తుంది. 124.4 సిసి ఇంజన్ ఇచ్చారు. ఇది 11.99 PS పవర్, 11 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 64 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చారు.
బజాజ్ పల్సర్ 125 నియాన్ ధర 78,989 - 85,331 వరకు ఉంటుంది. ఈ బైక్‌లో 124.4 సిసి ఇంజన్ ఇచ్చారు. ఇది 11.8 PS పవర్, 10.8 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 51.46 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.