Sudhama Temple: శ్రీకృష్ణుడి స్నేహితుడు సుదామునికి ఆలయం ఉంది.. ఎక్కడాంటే.?

|

Oct 06, 2024 | 8:49 PM

స్నేహానికి చిహ్నం శ్రీకృష్ణ, సుధామలు. అయితే శ్రీకృష్ణుడికి దేవుడిగా దేశ విదేశాల్లో మందిరాలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు, తన స్నేహితుడైన సుధాముడితో కలిసి పూజలను అందుకుంటున్నా ఆలయం.. దేశంలో ఒకేఒక్కటి ఉంది. దానిని సుధామపురి అని పిలుస్తారు. మరి ఆలయం ఎక్కడ ఉంది. ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..

1 / 5
గుజరాత్  పోర్ బందర్ తాలూకాలో  ఓ గ్రామంలో సుధాముడి జన్మించినందున ఆ ప్రాంతాన్ని సుదామపురి అని పేరు వచ్చింది.  శ్రీ కృష్ణునిని లీలలు చూసి ఆనందించడానికే నారద మహర్షి మధు, కారోచన అనే దంపతులకు సుదాముడుగా జన్మించాడని ప్రతీతి.

2 / 5
సుదాముడు జన్మించిన ఈ గ్రామంలో 12 వ 13వ శతాబ్దాల మధ్య సుధామ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రమంచంలోనే సుదామునికి నిర్మించిన ఏకైక ఆలయంగా ప్రఖ్యాతి చెందింది.

3 / 5
రాజస్ధాన్ కు చెందిన  రాజా వంశీకులు వివాహమైన తర్వాత కొత్త దంపతులు సుదాముని ఆలయానికి వచ్చి పూజలు చేయడం ఆచారం.ఈ ఆలయం గర్భగుడిలో సుదాముడు,  ఎడమ ప్రక్కన సుధాముడి భార్య సుశీల, కుడిప్రక్కన శ్రీ కృష్ణుడు ఆశీనులై దర్శనమిస్తారు.

4 / 5
యాభై స్ధంభాలతో నిర్మించబడిన మహామండపం తర్వాత గర్భగుడి వుంది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. గర్భగుడికి మీద ఉత్తర దేశ బాణీలో ఎత్తైన విమానం కనిపిస్తుంది. ఆలయానికి చుట్టూ నందనవనం, సుదాముడు ఉపయోగించిన బావి ఉన్నాయి.

5 / 5
పూజావేళలు: ఈ ఆలయంలో నిత్యం రాత్రి ఏడు గంటలకు సంధ్యా హారతి, స్వామివారికి  ‘దామాజీ తండుదల్’ (కుచేలుని అటుకులు)లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అటుకుల ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులకు సిరిసంపదలు, కోరుకున్న కోర్కెలు తీరతాయని నమ్మకం. ఇక అక్షయ తృతీయ రోజున “కుచేలుని దినం” గా ఈ సుధామాలయంలో ఉత్సవాలు జరుపుతారు.