
మహాభారతంలో విదురుడి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈయన గొప్ప మేధావి. ధృతరాష్ట్రులు వారికి విదురుడు సలహాదారుగా ఉండి, ఎన్నో గొప్ప విషయాలను తెలియజేశాడు. ధృతరాష్ట్రుడు, విదురుడి మధ్య జరిగే సంభాషణల్లో మహర్షి విదురుడు మంచి విషయాలను తెలియజేశాడు. అవి నేటితరం వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే విదురుడు ఒక వ్యక్తి ఆయుర్దాయాన్ని తగ్గించే కొన్ని విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ఒక వ్యక్తి జీవితంలో పుట్టుక, మరణం అనేది సహజం. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు అనే విషయం అందరికీ తెలుసు. అయినా కానీ చాలా మంది ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆరాట పడుతుంటారు. కానీ వారి కర్మలు, స్వభావం కారణంగా వారు తమ ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటారు. కాగా, అసలు విదురుడు మహాభారతంలో అకాల మరణానికి దారి తీసే కారణాల గురించి ఏం తెలియజేశాడు అంటే?

మహాభారతంలో ఒకానొక సందర్భంలో ధృతరాష్ట్రుడు మరణం గురించి ఒక ప్రశ్న అడిగాడు, మహాత్మ విదుర, అన్ని వేదాలలో మానవుని ఆయుర్దాయం వంద సంవత్సరాలు కదా, మరి ఎందుకు చాలా మంది వంద సంవత్సరాల వయసు పూర్తి కాకమందే మరణిస్తున్నారు అని ప్రశించాడు.

దానికి విదురుడు సమాధానం ఇస్తూ, రాజా, మీకు శుభం కలుగు గాక, కొన్ని విషయాలు ఒక వ్యక్తి ఆయురార్దాన్ని తగ్గిస్తున్నాయి. అవి ఏమింటే? అహంకారం, మితిమీరిన మాటలు, వైరాగ్యం, కోపం, స్వార్థం, స్నేహితులకు ద్రోహం చేయడం. ఈ ఆరు అంశాలే ఒక వ్యక్తి జీవితాన్ని తగ్గిస్తున్నాయి అని ఆయన తెలియజేశారు.

అయితే విదుర నీతి ఏం తెలియజేస్తుందంటే? మరణం అనేది శరీరానికి సంబంధించినది కాదు, అది తప్పుడు ప్రవర్తన, స్వార్థం, భావోద్వేగాలతో ముడి పడి ఉంటుందని, ఒ వ్యక్తి అహంకారం, కోపం, శారీరక వినాశనానికి దారితీస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది.