
మేషం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శుక్రుడు ధన స్థానంలోనే సంచారం చేయడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక విషయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.

కర్కాటకం: ఈ రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలోనే సంచారం చేయడం వల్ల జీవితంలోఅన్ని విషయాల్లోనూ శీఘ్ర పురోగతి ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కుదరడం గానీ జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలు వసూలవుతాయి.

కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థిరత్వం లభిస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడు అష్టమంలో స్వస్థానంలో సంచారం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తుల మీద వచ్చే ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామికి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం జరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అపా రంగా లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలిస్తుంది.

మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆస్తి కలిసి వస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో తృతీయ స్థానాధిపతి శుక్రుడి సంచారం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు, ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం పడుతుంది.