శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Edited By:

Updated on: Nov 26, 2026 | 12:01 PM

Shukra Blessings: డిసెంబర్ 3 నుంచి శుక్రుడి సంచారంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. స్వస్థానంలో ఒంటరిగా సంచరించనున్న శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు విలాసవంతమైన జీవితం అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

1 / 8
ప్రస్తుతం తన స్వస్థానమైన తులా రాశిలో ఉన్న శుక్రుడు డిసెంబర్ 3 నుంచి ఒంటరిగా సంచారం సాగిస్తాడు. ఇంత వరకూ శుక్రుడితో కలిసి ఉన్న బుధ గ్రహం రాశి మారడంతో శుక్రుడు జనవరి 2 వరకు తన స్వస్థానంలో ఒంటరి సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు శుక్రుడి బలం మరింత పెరిగి స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. శృంగార జీవితానికి, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు తులా రాశిలో సంచారం చేయడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం గడించడం, విలాస జీవితం అనుభవించడం వంటివి మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశుల జీవితాల్లో చోటు చేసుకుంటాయి.

2 / 8
మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ధనానికి లోటుండని జీవితం ఏర్పడుతుంది. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. భోగభాగ్యాల్లో జీవిస్తారు. విలాస జీవితానికి అలవాటుపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శుభ కార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. దాంపత్య జీవితం మరింత పరిపుష్టం అవుతుంది.

3 / 8
మిథునం: ఈ రాశికి పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. బాగా విలాస జీవితం గడపడంతో పాటు, వ్యసనాలకు అలవాటుపడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక విధాలుగా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. జీవనశైలి మారిపోతుంది. విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

4 / 8
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల జీవితాన్ని ఎంజాయ్ చేయడం మీద మక్కువ పెరుగుతుంది. సుఖసంతోషాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. విలాసాల్లో మునిగి తేలుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.  ఉద్యోగంలో జీతభత్యాలు, హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతాయి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది.

5 / 8
కన్య: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయ వృద్దికి తగ్గట్టుగా విలాసాలు, భోగభాగ్యాలు కూడా పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అనేక విధాలుగా లక్ష్మీకటాక్షం కలు గుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు ఆస్కారముంది. ఉన్నత వర్గా లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. విందులు, వినోదాలతో కాలం గడుపుతారు.  విదేశీ ఉద్యోగ, పర్యటన అవకాశాలు సైతంలభిస్తాయి.

6 / 8
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరగడంతో పాటు విలాస జీవితం, ఆధునిక జీవితం అలవడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. లక్ష్మీ కటాక్షం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల భోగభాగ్యాలకు, విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు లోటుండదు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. విహార యాత్రలు పెరుగుతాయి.

7 / 8
మకరం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆధునిక జీవనశైలి అలవడుతుంది. విలాసాలు, వ్యసనాలకు బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. జీవితంలో సుఖ సంతోషాలకు ప్రాధాన్యం పెరుగు తుంది. భోగభాగ్యాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.

8 / 8
కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి స్థితి వల్ల ఆదాయ వృద్ధికి ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా దూర ప్రాంత ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలు కూడా పెరుగుతాయి. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. విందులు విలాసాల్లో మునిగి తేలుతారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం కావడం లేదా సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం జరు గుతుంది.  అవసరానికి మించి చేతిలో డబ్బు ఉంటుంది. వీలైనంత హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us