Vastu Tips: ఇంట్లో ఏ దిశలో ఏ రకమైన హనుమంతుడి పటాన్ని పెట్టుకుంటే.. కష్టాలు తీరతాయో తెలుసా..

|

Jan 01, 2025 | 7:05 AM

కొత్త ఆశలు.. ఎన్నో కోరికలు.. సరికొత్త అంచనాలతో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాము. కొత్త ఏడాదిలోనైనా జీవితం మరింత మెరుగ్గా ఉండాలని.. సంతోషంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ప్రజలు రకరకాల పనులు చేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో ఈ ప్రదేశాల్లో పెడితే సంవత్సరం మొత్తం ఆనందంగా గడిచిపోతుంది. బజరంగబలి ఆశీస్సులు కూడా ఇంటి సభ్యుల వెంట ఉంటాయి.

1 / 8
హనుమంతుడిని సంకట మోచనుడు అంటారు. బజరంగ బలిని ఆరాధించడం వల్ల మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మకం. అంతేకాదు ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. న్యూమరాలజీ ప్రకారం.. రాడిక్స్ సంఖ్య 9.. 2025 సంవత్సరపు అంకెలను కలపడం ద్వారా ఏర్పడుతుంది. కుజు గ్రహం ఈ ఏడాదిని పాలించే గ్రహం.. ఈ అంగారక గ్రహానికి అధిపతిగా హనుమంతుడుగా పరిగణించబడతాడు. అటువంటి పరిస్థితిలో హనుమతుండి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి ఈ సంవత్సరం వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఈ దిశలలో బజరంగబలి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచడం శుభప్రదం.

2 / 8
నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టి అందులో వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఉంచడం మంచిది. దీనితో పాటు హనుమంతుని విగ్రహం, చిత్రాలను ఇంట్లో ప్రతిష్టించడం వల్ల ఆనందం, శాంతి, సంపద పెరుగుతుంది. అంతే కాదు ఇంట్లో ఉండే అన్ని రకాల వ్యాధులు, దోషాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల్లో విశ్వాసం పెరుగుతుంది.

3 / 8

గాలిలో ఎగిరే హనుమంతుడు: వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో హనుమంతుడు ఇంటికి దక్షిణ దిశలో ఎగురుతున్న హనుమంతుడు చిత్ర పటాన్ని ఏర్పాటు చేయండి. ఈ ఫోటోలో హనుమంతుడి భుజాలపై రాముడు ఉన్నట్లు ఉంటే మంచిది. ఇలా చేయడం వల్ల 2025 సంవత్సరంలో సమాజంలో కీర్తి,  ప్రతిష్టలు పెరుగుతాయి.

4 / 8
జెండా పట్టుకున్న హనుమంతుడు: వాస్తు శాస్త్రం ప్రకారం 2025లో హనుమంతుడు ఇంటి పడమర దిశలో చేతిలో జెండా పట్టుకుని నిలబడి ఉన్న భంగిమలో ఉన్న ఫోటో పెట్టుకోండి. దీంతో మీ పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

5 / 8

మహాబలి వీర హనుమంతుడు: 2025 సంవత్సరంలో బజరంగబలి వీరోచిత భంగిమలో నిలబడి, చేతిలో గద్ద పట్టుకొని ఉన్న చిత్ర పటాన్ని ఇంటి దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే కాదు ధైర్యం కూడా పెరుగుతుంది.

6 / 8
సంజీవని పర్వతం తెస్తున్న హనుమంతుడు: ఇంట్లో దీర్గకాళిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటే.. ఉపశమనం కోసం సంజీవని పర్వతం తెస్తున్న హనుమంతుడు చిత్ర పటాన్ని 2025వ సంవత్సరంలో ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం అటువంటి బొమ్మను ఉంచడం వల్ల ఇంట్లో హనుమంతుని ఆశీర్వాదం లభిస్తుంది. వ్యాధుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.

7 / 8
కూర్చున్న భంగిమలో హనుమంతుడు: వాస్తు శాస్త్రం ప్రకారం 2025లో ఇంటికి ఈశాన్య దిశలో కూర్చున్న భంగిమలో హనుమంతుడు ఎరుపు రంగు చిత్రాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల కోపం అదుపులో ఉంటుంది. అంతే కాదు ఇంటి నుంచి నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.

8 / 8
పంచముఖి హనుమంతుడు: 2025 సంవత్సరంలో పంచముఖి హనుమంతుడి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని ఖచ్చితంగా ఉంచండి. హనుమంతుని చిత్రపటాన్ని ఇంటి ప్రధాన ద్వారం లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంట్లో సానుకూలతను కాపాడుతుంది.