
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ప్రధాన ద్వారం, వంటగది మాత్రమే కాకుండా ఇంటి మెట్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీని విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక సమస్యలు వస్తాయంట. అయితే కొందరు పదే పదే, ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా సరే ఇంటి మెట్లపై కూర్చొని ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెట్లపై కూర్చోవచ్చా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం పదే పదే ఇంటి మెట్లపై కూర్చోవడం వలన ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుదంట. దీని వలన ఇంటిలో ప్రతి కూల శక్తి పెరిగి, ఒత్తిడి, ఆందోళన పెరగడం, ఇంటిలో గొడవలు జరగడం వంటి ఇబ్బందికర వాతావరణం నెలకుంటుంది. అందువలన వీలైనంత వరకు ఎక్కువగా ఇంటి మెట్లపై కూర్చొని ఉండటం మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పురోగతిలో కూడా మెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందువలన వీటి విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా ఇది మీ ఇంటి పురోగతికి అడ్డుకుంటుందంట. పదే పదే మెట్లపై కూర్చోవడం వలన ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎంత సంపాదించినా అది చేతిలో నిలవకపోవడం, ఖర్చులు అధికం అవ్వడం వంటి సమస్యలు తలెత్తులాయంట.

అంతే కాకుండా ఇలా పదే పదే మెట్లపై కూర్చోవడం అనేది సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంట. ఇంటి వాతావరణం, శక్తి కుటుంబంలో బంధాల్లో సమస్యలను తీసుకొస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంటిలో ఒత్తిడి, కలహాలు వంటి సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా ఎప్పుడో ఏదో ఒక గొడవల, అనారోగ్య సమస్యలు, ఇళ్లు బరువుగా అనిపించడం మనశ్శాంతి లోపించడం వంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు