
వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియజేస్తుంది. ఇంట్లోని చాలా సమస్యలకు వాస్తు పరిష్కారాలు చూపుతుంది. వాస్తు శాస్త్రం వల్ల ఇంట్లోని వస్తువులు ఎక్కడ ఉంటే సానుకూల ఫలితాలు, అవి ఎక్కడ ఉంటే ప్రతికూల ఫలితాలు పొందుతారో తెలుసుకోవచ్చు. వాస్తు గురించి తెలియకుండా కొందరు చాలా తప్పులు చేస్తుంటారు. దీంతో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. అందుకే ఇంటి నిర్మాణం చేసే ముందు, వస్తువులను ఎక్కడ పెట్టాలి అనేది వాస్తు ప్రకారం చేయాలి. మన చేతి నుంచి జారిపడే కొన్ని వస్తువులు మనకు చెడు సంకేతాన్ని ఇస్తాయి. వాస్తు ప్రకారం ఎలాంటి పనులు ఇంటికి ప్రతికూల ప్రభావాలను తెస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు.. సాధారణంగా మనం ప్రతి వంటకంలో ఉప్పు అనేది ఉపయోగిస్తాం. అంతేగాక, సనాతన సంప్రదాయం ప్రకారం ఉప్పును లక్ష్మీదేవికి సంబంధించిన అంశంగా చూస్తారు. అందుకే ఉప్పును ఎవరూ కాలితో తొక్కరు. అలాంటి ఉప్పు మన చేయి నుంచి జారితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఉప్పు మన చేయి నుంచి జారి కిందపడితే దురదృష్టంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది.

బియ్యం లేదా అన్నం.. అన్నం పరబ్రహ్మ స్వరూపమని హిందూ ధర్మంలో భావిస్తారు. అందుకే అన్నం, బియ్యాన్ని అన్నపూర్ణదేవిగా కొలుస్తారు. పవిత్రంగా భావిస్తారు. మన చేతి నుంచి బియ్యం లేదా అన్నం జారి కింద పడితే అది అశుభ సూచకంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇలా జరగడం వల్ల ఇంట్లో సంపద తరిగిపోయి నిత్యావసరాల కొరత ఏర్పడవచ్చు.

పాలు మనం రోజు తాగు పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా సేవిస్తారు. ఇక ఆవు పాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి పాలు మన చేతి నుంచి జారిపడిపోతే ప్రతికూల సంకేతంగా భావిస్తారు. ఇది ఇంట్లో శాంతిని దూరం చేస్తుంది. సానుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తుంది.

నాణేలు/డబ్బు.. సంపదను మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. అందుకే డబ్బుకు చాలా గౌరవం ఇస్తాము. డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయితే, కొన్ని సార్లు మన చేతి నుంచి డబ్బు లేదా నాణేలు జారి పడిపోతాయి. తరచూ అలా జరిగితే మాత్రం ఇంట్లో ఆర్థిక సమస్యలకు దారితీస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ధన నష్టం జరిగే అవకాశం ఉందని తెలుపుతోంది.

నూనె నూనె మనం సాధారణంగా అన్ని కూరల్లోనే ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. నూనెలు అందులోనూ ఆవ నూనె మన చేతిలోంచి పడిపోతే అశుభ సూచకమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా జరిగితే ఇంట్లో అశాంతి నెలకొంటుందని, ప్రతికూల ప్రభావంతో సమస్యలు ఏర్పడతాయని చెబుతోంది. (Declaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలు, అందుబాటులో వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)