
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి అధిపతి బుధుడు, అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, అదృష్ట సంఖ్యలు 5,6,8. ఇక ఈ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 11. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నందున కాస్త ఖర్చుల విషయంలో ఆచీ తూచీ అడుగు వేయడం మంచిది. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు. ఎందుకంటే, సమస్యల్లో చిక్కుకునే ఛాన్స్ ఉంది.

ఇక ధనస్సు రాశి వారికి శని ఏడవ ఇంట సంచరించడం వలన వివాహ సంబంధ విషయాల్లో జాప్యం అవ్వడం, వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. అక్టోబర్ తర్వాత గురు సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. జనవరి నెలలో గురు వక్రగతిలో ఉండటం వలన రాజయోగాన్ని కలిగిస్తాడు. డిసెంబర్ నెలలో రాహుకేతువుల గోచారం మీకు అన్నింటా విజయాలను అందిస్తుంది.

ధనస్సు రాశివారికి సంవత్సరం ప్రారంభంలో కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యమంలో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వృత్తి పరంగా మీకు ఇది సవాల్‌తో కూడిన సంవత్సరం అని చెప్పాలి. డిసెంబర్ తర్వాత రాహువు సంచారం వలన ఉద్యోగంలో బదిలీ, అధికారుల నుంచి ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అక్టోబర్ నెలలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.

విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది వీరు కష్టానికి తగిన ప్రతి ఫల అందుకుంటారు. రాజకీయ నాయకులకు మాత్రం ఇది గట్టుకాలమే అని చెప్పాలి. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కోరుకున్న పదవిని సంపాదించుకోలేరు. మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. అనుకోని విధంగా సమస్యల్లో చిక్కుకోవడం జరుగుతుంది కాబట్టి, తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ఇంటిలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఈ రాశి వారికి శని సంచారం వలన అత్తింటి వారి నుంచి, భాగస్వామి నుంచి కాస్త ఇబ్బందులు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు , కోపాలు వంటి వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి సహనంతో వ్యవహరించాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.