
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే తొలి ఏకాదశి తర్వాత గ్రహాల సంచారం, విష్ణు మూర్తి అనుగ్రహం కలగడం వలన ధన యోగం కలుగుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే అవుతుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది.

వృషభ రాశి : వృషభ రాశిని శుక్రుడి పాలిస్తాడు. దీని వలన శుక్రుడి వలన ధన యోగం కలుగుతుంది. సంపద పెరుగుతుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరికి ముట్టింది ముత్యమే, పట్టింది బంగారమే అవుతుంది.

మకర రాశి : మకర రాశి వారికి అధిపతి శని. వీరికి విష్ణు మూర్తి అనుగ్రహం వలన పెండింగ్‌లో ఉన్న పనులు చాలా త్వరగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్థులకు జీతాలు పెరగడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అంత శుభ ప్రదంగా ఉంటుంది. వీరికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కర్కాటక రాశి : చంద్రునిచే పాలించబడే కర్కాటక రాశి వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా వీరికి ఉద్యోగపరంగా ,ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. నగదు ప్రవాహం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి అధిపతి ఉన్నా విష్ణువు అనుగ్రహం వలన గజకేసరి రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన వీరికి అప్పుల బాధలు తొలిగిపోయి, ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, ఐటీ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు. వీరికి అన్నివిధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.