పొంగల్ పండుగ జనవరి 15,2026 ప్రారంభమై జనవరి 18 2026తో ముగుస్తుంది. ఈ పొంగల్ రోజున వ్యవసాయ భూమిలో పూజలు చేయడం, పశువులు, వాహనాలకు పూజలు చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా పశువులకు పూజలు చేసి వాటిని పూలతో అలంకరిస్తారు. తర్వాత జల్లికట్టు, పశువులకు పోటీలు పెట్టడం వంటివి చేస్తుంటారు.

ఈ పొంగల్ అనేది సూర్యుడు ఉత్తరాయణం వైపుకు మారడానికి కూడా సూచిస్తుంది. ఇది చాలా పవిత్రమైన రోజు, ఈరోజున సూర్య భగవానుడిని పూజించడం వలన ఆయన ఆశీస్సులు లభించి, అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని చెబుతుంటారు పండితులు. అంతే కాకుండా ఈ మాసం వివాహాలకు, అన్ని శుభకార్యాలకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే మాసంగా ఉంటుందని నమ్ముతారు.

ఇక పొంగల్‌ల్లో థాయ్ పొంగల్, మట్టు పొంగల్, భోగి పొంగల్ , కానుమ్ పొంగల్ అంటూ నాలుగు రకాలు ఉంటాయి. వీటిని నాలుగు రోజులు జరుపుకుంటారు. ఇందులో ముఖ్యమైనది థాయ్ పొంగల్, ఈ రోజు సూర్య భగవానుడిని పూజించి, సంప్రదాయ వంటకమై సక్కరై పొంగల్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రెండో రోజు మట్టు పొంగల్, ఈరోజున పశువులకు పూజ చేసి, వాటిని అలంకరించి, వాటికి ఆహారం పెడుతారు. ఈరోజు సంప్రదాయ ఎద్దుల ఆటల పోటీలు పెడుతుంటారు.

కానుమ్ పొంగల్ రోజున కుటుంబ సభ్యులు అందరూ కలిసి తాము పండిచిన ధాన్యాన్ని వండుకొని, రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి కలిసి తింటారు. ఇది కుటుంబ సఖ్యతను సూచిస్తుంది. భోగి పొంగల్ అంటే ఈ రోజు ఇంటిని అందంగా అలంకరించుకుంటారు, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి, కొత్త వస్తువులతో వాటిని భర్తీ చేస్తారు.