
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల విదేశాల్లో చదువులు, విదేశాల్లో ఉద్యో గాలకు సంబంధించి ఈ రాశివారు మరింత పట్టుదలగా, దృఢ సంకల్పంతో శ్రమించి తమ ఆశయాన్ని తప్పకుండా సాధించుకుంటారు. రావలసిన డబ్బును రాబట్టుకోవడం, ఆస్తి వివాదాన్ని ఏదో విధంగా పరిష్కరించుకోవడం, వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుడం వంటివి జరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను, పనుల్ని పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి అదనపు ఆదాయ మార్గాలు, అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా విజయవంతం అవుతాయి.

తుల: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల గృహ, వాహన సౌకర్యాల మీదా, ఆస్తి వివాదాల పరిష్కారం మీదా దృష్టి పెట్టి అనుకున్నది సాధించడం జరుగుతుంది. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నించి సాధించుకోవడం జరుగుతుంది. కుటుంబ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. చదువుల్లో ఉన్న విద్యార్థులు ఎంత శ్రమకైనా ఓర్చి, ఉత్తమ ఫలితాలను సాధించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి కుజుడు బుధుడితో కలవడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలను పూర్తిగా తగ్గించుకోవడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి శాయశక్తులా కృషి చేసి లబ్ధి పొందుతారు. ఆర్థిక పురోగతికి సంబంధించి ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టే అవకాశం ఉండదు.

ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో కుజ, బుధుల యుతి చోటు చేసుకున్నందువల్ల ఈ రాశివారికి కొద్దిపాటి ప్రయత్నంతో అనుకున్నవన్నీ సిద్ధించే అవకాశం ఉంది. మనసులోని కోరికలను పట్టుదలగా నెరవేర్చుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తన పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కొన్ని కీలక వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించుకుంటారు. పదోన్నతిని సాధించుకుంటారు.

మకరం: ఈ రాశిలో కుజ, బుధుల కలయిక వల్ల ఈ రాశివారు అనేక విజయాలు, సాఫల్యాలను సాధిస్తారు. సాధారణంగా వీరు లాభం లేనిదే ఏ పనీ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. లాభదాయక పరిచయాలను పెంపొందించుకుంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులను రాజీ మార్గంతో పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలను బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచుకుంటారు.