
వృషభ రాశి : వృషభ రాశి వారికి 2026 లక్కీ ఇయర్ అని చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి గురు గ్రహం లాభస్థానంలో శని సంచారం చేయడం వలన కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఆదాయం రెట్టింపు అయ్యి, అప్పుల బాధలు తీరిపోతాయి. ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఈ రాశి వారికి గురు గ్రహం ధన స్థానంలో ఉండటం వలన డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అనుకోని మార్గాల ద్వారా కొత్త ఆదాయం పుట్టుక రావడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారిపై గురు గ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి గరువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందున, మే చివరిలోగ ఈ రాశి వారు అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఉద్యోగ ప్రమోషన్స్ పొందడం, కొత్త ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. అన్నివిధాల కలిసి వస్తుంది.

మకర రాశి : మకర రాశి వారికి 2026లో ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వారు అనుకోని మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి గురు గ్రహం సప్తమ స్థానంలో ఉండటం వలన వీరు అప్పుల సమస్యల నుంచి బయటపడి, ఈ సంవత్సరం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు 2026 సంవత్సరంలో చాలా ఆనందంగా గడుపుతారు. దీనికి కారణం వీరు రుణ బాధల నుంచి బయటపడటమే, ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారు 2026లో ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి, ఆనందంగా గడుపుతారు.