
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు మీ ఆఫీసుకు తీసుకెళ్లే, పర్సులేదా బ్యాగ్ విషయంలో అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంట. అలాగే కొన్ని వస్తువులు వాటిలో ఉండటం మంచిది కాదంట. ఆఫీసుకు తీసుకెళ్లే బ్యాగు లేదా పర్సులో కొన్ని వస్తువుల ఉండటం, వాటి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోవడం సమస్యలను తీసుకొస్తుందంట.

కొంత మంది ఆఫీసు బ్యాగుల్లో ఎప్పుడూ కూడా బిల్ రిసిప్ట్స్ ఉండకూడదంట. కొంత మంది తమకు కావాల్సిన ప్రతి స్లిప్ కూడా బ్యాగులో వేసేస్తుంటారు. కానీ ఇవి వాస్తు ప్రకారం ప్రభావం చూపుతాయంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులో బ్యాగులో ఇళ్లు లేదా ఆఫీసుకు , మీ పర్సనల్ బిల్లులు ఏవైనా సరే ఉండకుండా చూసుకోవాలంట.

అదే విధంగా, బ్యాగుల్లో ఎప్పుడూ కూడా పాడైన చార్జర్లు, కత్తెరలు, బ్లేడ్ వంటివి ఉండటం మంచిది కాదంట. ఇవి మీ బ్యాగులో ఉండటం వలన ఇవి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. వాస్తు ప్రకారం ఇవి బ్యాగుల్లో ఉండటం అస్సలే మంచిది కాదు, దీని వలన ఒత్తి, సహోద్యోగులతో విభేదాలు పెరిగే ఛాన్స్ ఉంటుందట. అందుకే పదునైన వస్తువులు, పాత చార్జర్లు, పాత వస్తువులు ఎప్పుడూ కూడా ఆఫీసు బ్యాగులో ఉండకూడదు.

అలాగే కాస్మెటిక్ వస్తువులు కూడా బ్యాగులో ఉండటం మంచిది కాదంట. కొంత మంది ఆఫీసు బ్యాగులో దువ్వెన, పరిమళ ద్రవ్యాలు, అద్దం , క్రీమ్స్ లాంటివి మెంటైన చేస్తుంటారు. కానీ ఇది వాస్తును ప్రభావితం చేస్తుందంట. ఇలాంటి వస్తువులు ఆఫీసు బ్యాగులో ఉండటం వలన ఇది అనేక రకాల సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అంతే కాకుండా ఆఫీసు బ్యాగు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. బ్యాగు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే శుభ్రం చేయడం మర్చిపోకూడదు. ఎందుకంటే? ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందుకే, వారానికి ఒకసారి బ్యాగులోని చెత్తను తొలిగించి, దానిని శుభ్రపరచాలి, విరిగిన, పాడైన వస్తువులను తీసివెయ్యాలి. లేకపోతే ఇది ప్రతికూలతను పెంచుతుందంట.